18 ఏళ్ల నాడు 'సార్స్' మరణమృదంగం... దాన్ని దాటేసిన కరోనా!

10-02-2020 Mon 09:01 | International
  • 26 దేశాలకు విస్తరించిన కరోనా
  • 2002లో వచ్చిన సార్స్ కారణంగా 774 మంది మరణం
  • కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 900 పైమాటే
ఇప్పటికే 26 దేశాలకు విస్తరించిన కరోనా వైరస్, 2002 - 03లో వణికించిన సార్స్ వైరస్ రికార్డును అధిగమించింది. దాదాపు 18 సంవత్సరాల క్రితం వచ్చిన సార్స్ 774 మందిని బలితీసుకోగా (అధికారిక లెక్కలు), ఇప్పుడు కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 900 దాటింది. కరోనా మృతులు వేల సంఖ్యలోనే ఉన్నారన్న అనుమానాలు ఉన్నా, చైనా ప్రభుత్వం చెబుతున్న గణాంకాలు మాత్రం ఇవే.

నేడు కరోనా ఎలాగైతే చైనాలో వెలుగులోకి వచ్చిందో, నాడు సార్స్ కూడా చైనాలోనే తొలిసారి బయటకు వచ్చింది. ఈ రెండు వైరస్ లూ ఒకే క్రిమి కుటుంబానికి చెందినవి కావడం గమనార్హం. ఈ రెండింటినీ జీవాయుధాలుగా చైనాయే స్వయంగా అభివృద్ధి చేసిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.

ఇక, ప్రస్తుతం అధికారిక లెక్కల ప్రకారం, చైనాలో 40 వేల మంది వరకూ కరోనా సోకి బాధపడుతున్నారు. అందులో 6,188 మంది పరిస్థితి విషమంగా ఉంది. కొత్తగా 3 వేల మంది వరకూ అనుమానితులు ఆసుపత్రుల్లో చేరారు.

చైనాకు వెలుపల ఫిలిప్పీన్స్ లో ఒకరు, హాంకాంగ్ లో ఒకరు మరణించారు. ఇండియాలో మూడు కేసులు నమోదయ్యాయి. వీరు ముగ్గురూ చైనాలోని వూహాన్ నుంచి వచ్చిన వారు కావడం గమనార్హం. ఇదిలావుండగా, వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు చైనా ఇప్పటికే 1200 కోట్ల డాలర్లను విడుదల చేసింది. రికార్డు సృష్టిస్తూ, 10 రోజుల్లో 1000 పడకల ఆసుపత్రిని నిర్మించింది. కరోనాకు అడ్డుకట్ట వేసే విషయంలో తమవంతు సహకారాన్ని అందిస్తామని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కు ఫోన్ లో చెప్పారు.
Corona VirusSarsDeathRecord

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more